రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం 11.30కి ప్రారంభం కానున్నాయి. ఈనెల 22 నుంచి 25 వరకు.. 3రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆర్థిక శాఖ సీఎం దగ్గరే ఉండటంతో.. రాష్ట్ర బడ్జెట్ ను సీఎం కేసీఆర్ సభ ముందు పెడతారు.
ప్రగతి భవన్లో ఈ సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. బడ్జెట్ సమావేశాలతో పాటు ప్రభుత్వ పథకాల అమలుపై మీటింగ్ లో చర్చించారు నేతలు. బడ్జెట్ పద్దులపై చర్చించి… ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోక్ సభ ఎన్నికలు ఉండటంతో… ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెడుతున్నప్పటికీ…వార్షిక బడ్జెట్ కు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఈసారి రాబడులు 19 శాతం దాటడంతో… మొత్తం బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు పైగానే ఉంటుందని సమాచారం.
