రుణయాప్ లపై హైకోర్టు విచారణ మార్చి 18కి వాయిదా

రుణయాప్ లపై హైకోర్టు విచారణ మార్చి 18కి వాయిదా

రుణ యాప్‌లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రుణ యాప్‌లను తొలగించేందుకు వెంటనే ప్లేస్టోర్‌లను సంప్రదించాలని  సూచించింది. యాప్‌ల నిర్వాహకులను కట్టడి చేసేలా  కఠిన చర్యలు తీసుకోవాలని కూడా  ఆదేశించింది. లాయర్‌ కళ్యాణ్‌ పిల్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. చైనా రుణయాప్‌ ల కారణంగా బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్‌ తెలిపారు. దీంతో ఆ వేధింపులపై నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది . దీనికి సంబంధించి తదుపరి విచారణ మార్చి 18కి కోర్టు వాయిదా వేసింది కోర్టు.