
హైదరాబాద్, వెలుగు: నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్–2018 ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్స్‌లో స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు ఉన్నాయో లేదో చెప్పాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టూడెంట్ల నిష్పత్తిలో బాత్రూంలు, టాయిలెట్లు లేవంటూ హైదరాబాద్కు చెందిన కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది. హాస్టల్స్ లో ఉన్న వసతులపై 3 వారాల్లోగా రిపోర్టు ఇవ్వాలని తెలిపింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.