- వంద లేట్ ఫీజుతో 20 దాకా చాన్స్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడగించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల ప్రిన్సిపాళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ వెల్లడించారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 13వ తేదీ వరకు విద్యార్థులు తమ కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని, రూ.వంద లేట్ ఫీజుతో 14 నుంచి 20వ తేదీ వరకు చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రిన్సిపాళ్లు సాధారణ ఫీజు మొత్తాన్ని ఈనెల 13 లోగా, లేట్ ఫీజు మొత్తాన్ని 21 లోగా బోర్డు ఖాతాకు ఆన్లైన్లో జమ చేయాలని, ఈ సమాచారాన్ని కాలేజీ నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని ఆమె ఆదేశించారు.
