
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న లాసెట్, పీజీఎల్ సెట్ సెకండ్ ఫేజ్ సీట్లను అలాట్ చేసినట్టు అడ్మిషన్ల కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. సెకండ్ ఫేజ్లో ఆయా కోర్సుల్లో మొత్తం 3,447 సీట్లు ఉండగా, 3,331 మంది అభ్యర్థులకు సీట్లను అలాట్ చేసినట్టు చెప్పారు. దీంట్లో ఎల్ ఎల్ బీ మూడేండ్ల కోర్సులో 2,120 సీట్లుండగా 2,097 సీట్లు, ఎల్ ఎల్ బీ ఐదేండ్ల కోర్సులో 917 సీట్లకు 793 సీట్లను అలాట్ చేసినట్టు చెప్పారు. ఫస్ట ఫేజ్ లో 6894 సీట్లకు గానూ 5912 సీట్లు అలాట్ చేశామని, దీంట్లో 3729 మంది కాలేజీల్లో చేరారని పేర్కొన్నారు. సెకండ్ ఫేజ్ లో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.