టీఎస్​ లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్​ రిలీజ్

టీఎస్​ లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్​ రిలీజ్

12 వరకూ ఆన్​లైన్ రిజిస్ర్టేషన్లు 

హైదరాబాద్, వెలుగు : ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం టీఎస్​ లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్​ను అధికారులు రిలీజ్ చేశారు. సోమవారం ఉన్నత విద్యా మండలిలో కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి అధ్యక్షతన లాసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం జరిగింది. మంగళవారం నోటిఫికేషన్​ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. 

నవంబర్  2 నుంచి 12 వరకూ ఆన్​లైన్ రిజిస్ర్టేషన్​తో పాటు స్కాన్డ్  సర్టిఫికేట్లను అప్​లోడ్ చేయాలని సూచించారు. 18, 19న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని,  22న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ చేస్తామని అధికా రులు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు 23 నుంచి 26 వరకూ కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.