అప్లికేషన్ డేట్ పొడిగింపు మోడల్ స్కూల్స్ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు

అప్లికేషన్ డేట్ పొడిగింపు మోడల్ స్కూల్స్ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు

తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరవ తరగతి, 10వ తరగతిలో ప్రవేశం పొందానికి నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024కు దరఖాస్తు పొడిగిస్తూ  విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూల్ లల్లో 19,400 సీట్లను ఈ పరీక్ష ద్వారా కేటాయిస్తారు. జనవరి 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 2తో పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ రాష్ట్రా విద్యాశాఖ అప్లికేషన్ డేట్ ను  మార్చి 11 వరకూ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకొని స్టూడెంట్స్ కు ఇది మరొ అవకాశం. ఏప్రిల్ 1న హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 100 ప్రశ్నలతో 100 మార్కులకు ఛాయిస్ బేసడ్ టెస్ట్ ఉంటుంది. నాలుగు సబ్జెక్టుల నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున ఇస్తారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ కూడా ఇస్తారు. 

మోడల్ స్కూల్ ఉన్న ప్రతి మండలంలో  ఏప్రిల్ 7న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి,  మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు. సెలక్టైయిన స్టూడెంట్స్ లిస్ట్ మే 25 న విడుదల చేశారు.  అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 1 నుంచి తరగతులు నడుస్తాయి. అధికారిక వెబ్ సైట్ అప్లై చేసుకోవాలి. దరఖాస్తు రుసుము రూ.200, బీసీ, ఎస్టీ, ఎస్సీ, EWS, దివ్యాంగ విద్యార్థులకు రూ.125 మాత్రమే.