
హైదరాబాద్, వెలుగు : టీశాట్ నెట్ వర్క్ ప్రసారాలు ఇకపై జీశాట్ 16పై కొనసా గుతాయని టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటిదా కా జీశాట్ 8లో ప్రసారాలు కొనసాగగా, జీశాట్ 16కు మైగ్రేట్ అవుతూ ఇస్రోకి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్)తో శుక్రవారం బెంగళూ రులో ఒప్పందం చేసుకున్నారు.
ఒప్పం దం ప్రకారం 6 మెగాహెర్ట్జ్ కేయూ బ్యాం డ్ విడ్త్‌లో జీశాట్ 16 ద్వారా టీశాట్ ప్రసారాలు కొనసాగుతాయని శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా విద్యార్థులకు నెట్ వర్క్ ప్రసారాలు మరింత మెరుగ్గా అందుతాయని చెప్పారు. జీశాట్ 16 ద్వారా విద్యా చానల్‌లో ప్రసారాలు చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.