లాస్ట్ డేట్ ఇదే.. ఎంసెట్2024 అప్లై చేస్తున్నారా?

లాస్ట్ డేట్ ఇదే..  ఎంసెట్2024  అప్లై చేస్తున్నారా?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు పొందాలంటే TSEAMCET రాయాల్సిందే. తెలంగాణ హైయర్ ఎడ్యూకేషన్ బోర్డు నిర్వహించే  ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ చదవవచ్చు. ‘టీఎస్‌ఈఏపీసెట్‌-2024’కి ఫిబ్రవరి 26 నుంచి ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 6వ తేదీ వ‌ర‌కు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ద‌ర‌ఖాస్తుల‌ స్వీకరణకు అవ‌కాశం ఉంది. ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు అప్లై చేసుకోవడానికి అర్హులు.


రూ.250 లేట్ ఫీజుతో  ఏప్రిల్ 9వ తేదీ వ‌ర‌కు, రూ. 500 ఆల‌స్యం రుసుంతో ఏప్రిల్ 14వ తేదీ వరకు, రూ. 2500 ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 19 వ‌ర‌కు, రూ. 5000 ఆల‌స్య రుసుంతో మే 4వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని  నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మే 9, 10వ తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సుల‌కు, మే 11, 12 తేదీల్లో అగ్రిక‌ల్చర్ కోర్సులు, ఫార్మసీ కోర్సుల‌కు ప్రవేశ ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు. 
 

ALSO READ :- GOAT OTT Rights: నెట్‌ఫ్లిక్స్ చేతికి దళపతి గోట్..కళ్ళు చెదిరే మొత్తంలో డిజిటల్ రైట్స్