కొండాపూర్ ఇండస్ట్రియల్  పార్క్ ను సందర్శించిన విష్ణువర్ధన్ రెడ్డి

కొండాపూర్ ఇండస్ట్రియల్  పార్క్ ను సందర్శించిన విష్ణువర్ధన్ రెడ్డి

మనోహరాబాద్, వెలుగు: మండలంలోని కొండాపూర్ లో గల టీఎస్ఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)  పార్కును బుధవారం ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి తన బృందంతో కలిసి పరిశీలించారు.

ఫ్యాక్టరీ యజమానులు సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరడంతో ఆరు నెలల్లో ఏర్పాటు చేసి విద్యుత్ అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ మాధవి, జనరల్ సెక్రెటరీ జీవీ సుబ్రహ్మణ్యం, సాంబశివరావు,  శ్రీకాంత్,  అశోక్ కుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.