- ఈ నెల 27 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్‌లో సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, అటెండెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీఎస్‌ఎల్‌పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ‘www.tgprb.in’ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 27 నుంచి డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.
