TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల 

TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల 

హైదరాబాద్: TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదలైంది. ఈ మేరకు TSPSC అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా TSPSC వెబ్ సైట్ లో పెట్టారు. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి తమ  ఓఎంఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని  కోరారు. అలాగే TSPSC మాస్టర్ కీతో చెక్ చేసుకోవాలని చెప్పారు. TSPSC  కీ లో  ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31 నుంచి  వచ్చే నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులకు తమ అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొన్నారు.

అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఇంగ్లీష్ లో మాత్రమే రాసి పంపాలని సూచించింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఫైనల్ కీని రిలీజ్ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.tspsc.gov.in ను సంప్రదించవచ్చు.