వారంలో  గ్రూప్-1 పికప్ లిస్టు !

వారంలో  గ్రూప్-1 పికప్ లిస్టు !

హారిజెంటల్ విధానంలోనే పోస్టుల భర్తీ.. టెన్త్, ఇంటర్ పరీక్షల తర్వాతే మెయిన్స్ 

హైదరాబాద్, వెలుగు : గ్రూప్1 పోస్టుల భర్తీపై హైకోర్టు నుంచి క్లారిటీ రావడంతో మెయిన్స్ నిర్వహణపై టీఎస్​పీఎస్సీ దృష్టి పెట్టింది. వారంపది రోజుల్లోనే పికప్ లిస్టు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. శుక్రవారం టీఎస్పీఎస్సీ ఆఫీస్​లో కమిషన్ చైర్మన్ జనార్ధన్​రెడ్డి నేతృత్వంలో కమిటీ సమావేశమైంది. గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్ 3, హాస్టల్ వార్డెన్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ, కోర్టు కేసులపై చర్చించారు. వర్టికల్ విధానంలో గ్రూప్1లో 503 పోస్టులను భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, వీటిలో 225 పోస్టులు ఉమెన్స్​కు కేటాయించారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా, హారిజెంటల్ విధానంలోనే భర్తీ చేయాలని మధ్యంతర ఉత్త ర్వులు ఇచ్చింది. దానిపై క్లారిటీ లేదని టీఎస్పీఎస్సీ ఫైనల్ తీర్పు కోసం వేచిచూస్తోంది.

ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ వేసిన కౌంటర్ సమయంలోనూ హారిజెంటల్ విధానంలో గ్రూప్1 పోస్టులను భర్తీ చేయాలని మళ్లీ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. దీంతో గ్రూప్1 పోస్టులను హారిజెంటల్ విధానంలోనే భర్తీ చేయాలని నిర్ణ యం కమిషన్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్​ఎగ్జామ్స్ టెన్త్, ఇంటర్ పరీక్షల తర్వాత నిర్వహిస్తే బెటర్ అనే భావనలో అధికారులు ఉన్నారు. గ్రూప్​ 2 నోటిఫికేషన్​ శుక్రవారం రిలీజ్ చేయాలని భావించినా, టెక్నికల్ ప్రాబ్లమ్​తో వాయిదా వేసినట్టు తెలిసింది.