TSPSC సెక్రటరీ, బోర్డు మెంబర్ ను విచారించిన సిట్

 TSPSC సెక్రటరీ, బోర్డు మెంబర్ ను విచారించిన సిట్

TSPSC పేపర్ లీకేజీలో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు 12 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించిన సిట్ అధికారులు..  ఏప్రిల్ 1న TSPSC బోర్డు మెంబర్ లింగారెడ్డిని  రెండు గంటల పాటు విచారించారు.  సిట్ చీఫ్ ఎఆర్ శ్రీనివాస్ అధ్వర్యంలో ఎంక్వైరీ కొనసాగింది. లింగారెడ్డి స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు.  పేపర్ లీకేజీలో అరెస్ట్ అయిన నిందితుడు రమేష్ .. లింగారెడ్డికి పీఏగా ఉన్నాడు. 

ఇక ఇదే కేసులో  TSPSC సెక్రటరీ నఅనితా రామచంద్రన్ ను 4 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. పేపర్ తయారీ, వాటి భద్రత,పరీక్షల నిర్వహణపై వారి వాగ్ముంలాన్ని అధికారులు నమోదు చేశారు. మరోవైపు గ్రూప్ 1 పరీక్షలో 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను సైతం సిట్ విచారించనుంది.  మొత్తం 6 పరీక్షలకు చెందిన ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లుగా సిట్ గుర్తించింది. ప్రస్తుతం శమీమ్, సురేష్, రమేష్ లను కస్టడీలోకి తీసుకుని సిట్ విచారణ చేస్తోంది.