
తెలంగాణ గురుకుల సొసైటీ పరిధిలోని 35 జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్‌ఆర్‌జేసీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. పరీక్షకు 64,324 మంది హాజరుకాగా అందరినీ క్వాలిఫై చేసినట్టు టీఎస్‌ఆర్‌జేసీ సెట్ కన్వీనర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈనెల 29న ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు, 30న బైపీసీ, ఎంఈసీ కోర్సులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఎంపీసీలో 1,300, బైపీసీలో 1,640, ఎంఈసీలో 60 సీట్లున్నాయని, 1:5 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సిలింగ్‌కు పిలుస్తామని చెప్పారు. పాత జిల్లాల్లోని ఎంపిక చేసిన గురుకుల కాలేజీల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వివరించారు.