దొరికిన ఆర్టీసీ బస్సు..టైర్లు మాత్రమే మిగిలాయి

దొరికిన ఆర్టీసీ బస్సు..టైర్లు మాత్రమే మిగిలాయి

హైద్రాబాద్ : కనిపించకుండా పోయిన తెలంగాణ ఆర్టీసీ బస్సు ఆచూకి నాందేడ్ లో లభ్యమైంది. అయితే అప్పటికే దొంగలు అనుకున్నంత పని చేశారు. గ్యాస్ సిలిండర్, కట్టర్ తో బస్సును డిస్ మాంటిల్ చేసేశారు. మంగళవారం అర్ధరాత్రి గౌలిగూడా CBS లో చోరీకి గురైన బస్సు .గురువారం  నాందేడ్ లో ఓ షెడ్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బస్సును క్రాష్ చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు అప్జల్ గంజ్ పోలీసులు. బస్ దొంగిలించిన వ్యక్తులు పరారీ కావడంతో … క్రాష్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.