అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

తాండూర్, వెలుగు: ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య కు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ రాజప్ప.. యాలాల మండలం దావులపూర్ శివారులో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెంది మంగళవారం కనిపించాడు. తను రాసిన సూసైడ్ నోట్ లో అధికారుల వేధింపులు తన చావుకు కారణమని పేర్కొన్నాడు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాజప్ప ఆత్మహత్యపై వార్తలు అవాస్తవాలు :  ఆర్టీసీ ఎండీ సజ్జనార్

శ్రామిక్‌‌‌‌ టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఖండించారు. ఆర్టీసీ అధికారులు వేధించడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదన్నారు.  మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.   గత నెలలో అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే  12 రోజులు విధులకు గైర్హాజరయ్యారు. అయినా ఆయనకు డ్యూటీని కేటాయించడం జరిగింది. గత మూడు రోజులు నుంచి కూడా విధులకు హాజరుకావడం కాలేదని అన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.