
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభించింది. బస్‌భవన్‌లో సంస్థ ఎండీ సజ్జనార్ వెబ్‌సైట్‌ను బుధవారం లాంచ్ చేశారు. ప్రజలందరూ ఈజీగా ఉపయోగించేలా తయారుచేసినట్టు ఆయన చెప్పారు. కొత్త వెబ్‌సైట్‌పై ప్రయాణికులు సలహాలు, సూచనలు చెప్పాలని కోరారు. tsrtc.telangana.gov.inలో టికెట్ బుకింగ్స్‌తోపాటు, ఇతర సమాచారం కూడా పొందవచ్చని తెలిపారు. అంతకుముందు బస్‌భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు.