డెలివరీ చార్జీలపై ఆర్టీసీ కొత్త నిర్ణయం

డెలివరీ చార్జీలపై ఆర్టీసీ కొత్త నిర్ణయం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్టీసీ హోం డెలివరీ పార్సిల్​ చార్జీలను సవరించింది. ఒక్కో సర్వీసుపై రూ.30 నుంచి రూ.120 వరకు తగ్గించింది. ప్రస్తుతం10 కిలోలలోపు పార్సిల్‌‌‌‌‌‌‌‌కు రూ.80 ఉండగా, రూ.55కి తగ్గించింది. 11 నుంచి 30 కిలోల పార్సిల్‌‌‌‌‌‌‌‌కు రూ.150 ఉండగా, రూ.90కి తగ్గించింది. 51 నుంచి100 కిలోల వరకు ఉన్న పార్సిల్‌‌‌‌‌‌‌‌కు రూ.300 తీసుకుంటుండగా, రూ.180కి తగ్గించింది. పార్సిల్‌‌‌‌‌‌‌‌ కవర్లకు500 గ్రాముల వరకు రూ.30 తీసుకుంటుండగా, రూ.15 చార్జి చేయనున్నారు. 501 గ్రాముల నుంచి కిలో వరకుంటే దాన్ని రూ.25కి తగ్గించారు.