ఆర్టీసీలో సోలార్ ప్యానెల్ : నష్టాలను తగ్గించేలా.. అధికారుల ప్లాన్

ఆర్టీసీలో సోలార్ ప్యానెల్ : నష్టాలను తగ్గించేలా.. అధికారుల ప్లాన్

హైదరాబాద్, వెలుగు : నష్టాలను తగ్గించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మిని థియేటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించి టిక్కెటేతర ఆదాయం పెంచుకుంటున్నారు. అలాగే వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆర్టీసీ అధికారులు. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. కరెంట్ బిల్లును ఆదా చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా ప్రతి డిపోకు 80 శాతం విద్యుత్ ను సొంతంగా ఉత్పత్తి చేసుకోనున్నారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పూర్తయితే పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు ఆదా అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే అన్ని డిపోల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు సగానికి పైగా జరిగింది. ప్రధానంగా ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్లలో సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తిని వచ్చే నెల నుం చి ప్రారంభిస్తా మని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లు ఆదా అవ్వనుంది. ప్రస్తుతం ఒక్కో డిపోకు సంబంధించి కరెంట్ బిల్లు రూ.2 లక్షల వరకు ఉంటోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. బర్కత్ పురాతో పాటు మరో రెండు డిపోల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదు. మిగతా అన్ని డిపోల్లో వీటి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.2 కోట్ల 20 లక్షలు ఆదా చేయాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో  రూ.80 లక్షలు గ్రేటర్ పరిధిలోనే ఆదా కానుంది. గ్రేటర్ లోని అన్ని డిపోల్లో సోలార్ విద్యుత్ కు ఉత్పత్తికి 2 నెలలు పట్టే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఖాళీ స్థలాల్లోనూ..

తెలంగాణ పునరుద్ధరణ ఇంధన వనరుల వినియోగ సంస్థ సోలార్ ప్యానెళ్ల ఉపయోగంవిషయంలో అన్ని విభాగాలను ప్రోత్సహిస్తోం ది. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు కరెంట్ బిల్లును తగ్గించుకోవాలన్న ఆలోచన చేశారు. ముం దుగా అన్ని డిపోల్లో సోలార్ విద్యుత్ ను అందుబాటులోకి తేనున్నారు. అలాగే రాష్ట్రంలో ఆర్టీసీకి చాలా కమర్షియల్ స్పే స్ తోపాటు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాల్లో కూడా సోలార్ ప్యానెళ్లను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. బస్ భవన్ తో పాటు జోనల్ శిక్షణ కేంద్రాలు, సిటీ నలుమూలల ఉన్న బస్ స్టేషన్ లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఆరు నెలల్లో అందుబాటులోకి తేవాలని సూచిస్తున్నారు.

యూనిట్ కు ఖర్చు తక్కువ

ఆర్టీసీ వాడుతున్న విద్యుత్ కు సంబంధించి కమర్షియల్ విద్యుత్ కింద యూనిట్ కు 10 రూపాయలు చెల్లిస్తోంది. అదే సౌర విద్యుత్ యూనిట్ కు చాలా తక్కు వ ఖర్చు అవుతుంది. సౌర విద్యుత్ యూనిట్ 5.5 రూపాయలే ఉంది. దీంతో ప్రస్తుతం ఒక్క ఆర్టీసీయే కాదు రైల్వేతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా సోలార్ విద్యు త్ పై ఆసక్తి చూపుతున్నాయి. భవిష్యత్ లో సోలార్ విద్యుత్ ను తమ అవసరాలకు మించి ఉత్పత్తి చేస్తామని అధికారులు తెలిపారు.