ఆర్టీసీ కార్మికుల బకాయిలు చెల్లించాలి

ఆర్టీసీ కార్మికుల బకాయిలు చెల్లించాలి
  •     టీఎస్​ఆర్టీసీ స్టాఫ్​అండ్​ వర్కర్స్​ఫెడరేషన్

హైదరాబాద్,వెలుగు :  ఆర్టీసీ కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని టీఎస్​ఆర్టీసీ స్టాఫ్​అండ్​వర్కర్స్​ఫెడరేషన్​డిమాండ్​ చేసింది.  ఈనెల 23న డిమాండ్స్​డేగా పాటించాలని నిర్ణయించినట్టు ఫెడరేషన్​ అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్​ రావు పేర్కొన్నారు.  ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎరియర్స్ బాండ్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

ఆర్టీసీ కార్మికులకు ఆర్పీఎస్​ 2013కు సంబంధించి ఇచ్చిన బాండ్ డబ్బులు రూ. 281కోట్లు విడుదల చేస్తున్నామని ఫిబ్రవరి 10న  సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారని,  2 నెలలు గడచినా డబ్బులు చెల్లించలేదని తెలిపారు.  తమ డిమాండ్లను నెరవేర్చేందుకు డిమాండ్స్​ డే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ రోజు ఉద్యోగులంతా  బ్యాడ్జెస్ ధరించి డ్యూటీలకు హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు.