
- సర్కిళ్లవారీగా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి
- కైట్స్ ఎగుర వేసే సమయంలో కరెంట్ తీగలకు తాకే చాన్స్
- అధికారులతో టీఎస్ఎస్పీడీసీఎల్సీఎండీ ముషారఫ్ ఫారూఖీ మీటింగ్
హైదరాబాద్,వెలుగు: సిటీలో విద్యుత్సమస్యలపై వెంటనే ఫోన్‌చేసి చెప్పాలని టీఎస్ఎస్పీడీసీఎల్సీఎండీ ముషారఫ్ఫారూఖీ సూచించారు. ఏ ప్రాంతంలోనైనా కరెంట్సరఫరాలో అంతరాయం తలెత్తితే తమ సర్కిల్ పరిధిలోని ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా సర్కిళ్లవారీగా కంట్రోల్‌రూమ్‌లు పనిచేస్తాయని తెలిపారు. బల్దియాలోని సీజీఎంలు, సూపరింటెండెంట్ఇంజనీర్లతో ఆదివారం ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
అన్ని సర్కిళ్ల పరిధిలో అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సంక్రాంతి పండగ వేళ పతంగులు, మాంజా వంటివి విద్యుత్ తీగలపై పడడం కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. వెంటనే ఫోన్‌నంబర్లలో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఎమర్జెన్సీ సమయంలో 1912 ను కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ పరిధి
హైదర్‌గూడ, హిమాయత్‌నగర్, రెడ్‌హిల్స్, చిక్కడపల్లి, విద్యానగర్, మెహదీపట్నం, ఏసీగార్డ్స్, మోతీమహల్, రేతిబౌలి, టోలీచౌకి, నాంపల్లి, నారాయణ ప్రాంతాలకు చెందిన వారు 9491629047 నంబర్ లో సంప్రదించాలి.
హైదరాబాద్ సౌత్ పరిధి
బేగంబజార్, ట్రూప్‌బజార్, అబిడ్స్, కోఠి, చార్మినార్, ఖిల్వత్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, చంచల్‌గూడ, మలక్‌పేట ప్రాంతాలవారు 9491628269కు ఫోన్ చేయాలి.
సికింద్రాబాద్ పరిధి
ప్యారడైజ్, ఐడీపీఎల్, ప్రాగాటూల్స్, బోయిన్పల్లి, బన్సీలాల్‌పేట, ఆల్వాల్, బొచ్చబొల్లారం, నెహ్రూనగర్, బేగంపేట, బాలానగర్, సీతాఫల్మండి, చిలకలగూడ ప్రాంతాల వారు 9491629380 నంబర్ లో సంప్రదించాలి.
బంజారాహిల్స్ పరిధి
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, గ్రీన్లాండ్స్, మోతీనగర్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, సనత్‌నగర్, బోర బండ, మాదాపూర్, ఫిలింనగర్, యూసుఫ్‌గూడ, కళ్యాణ్‌నగర్, శ్రీనగర్ కాలనీ వారు9491633294 నంబర్ కు ఫోన్ చేయాలి.
సైబర్‌సిటీ పరిధి
గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మణికొండ, కొండాపూర్, కేపీహెచ్ బీ, చందానగర్, వసంత్‌నగర్, ఇబ్రహీంబాగ్ ప్రాంతాల వాసులు 9493193149 నంబర్ లో సంప్రదించాలి.
రాజేంద్రనగర్ పరిధి
కాటేదాన్, శివరాంపల్లి, ఎండీపల్లి, శాస్ర్తిపురం, అత్తాపూర్, రాజేంద్రనగర్, జల్పల్లి, బాలాపూర్, పహాడీషరీఫ్ ప్రాంతాలవారు 7382100322 నంబర్ లో ఫోన్ చేయాలి.
సరూర్‌నగర్ పరిధి
చంపాపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, బడంగ్‌పేట, మీర్‌పేట, ఎల్బీనగర్, కొత్తపేట, ఆటోనగర్, తుర్కయాంజాల్, ఇంజాపూర్ ప్రాంతాల వారు 7901679095 నంబర్ లో సంప్రదించాలి.
హబ్సీగూడ పరిధి
సైనిక్‌పురి, నాచారం, బోడుప్పల్, ఉప్పల్, మల్లాపూర్, రామంతాపూర్, మల్కాజిగిరి, మౌలాలి, యాప్రాల్ ప్రాంతాల వాసులు 9491039018 నంబర్లో సంప్రదించాలి.
మేడ్చల్ పరిధి
కూకట్పల్లి, మియాపూర్, నిజాంపేట, జీడిమెట్ల, డీపీ పల్లి, కొంపల్లి, గాజుల రామారం వాసులు 7382618971 నంబర్ కు ఫోన్ చేయాలి.