ఫిలిప్పీన్స్లో భూకంపం..

ఫిలిప్పీన్స్లో భూకంపం..

ఫిలిప్పీన్స్లోని మిండనావోలో శనివారం (డిసెంబర్2)న భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో భూమి కంపించిన్నట్లు యూరోపియన్ మెడిటరే నియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం 63 కి.మీ లోతులో ఉందని వెల్లడించింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో జరిగిన ప్రాణ, ఆస్తినష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. 

భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలను జారీ చేసింది అమెరికా సునామి హెచ్చరకిల వ్యవస్థ. గత నెలలో (నవంబర్) లో దక్షిణ పిలిప్పీన్స్ లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించి 8 మంది మృతిచెందారు. నవంబర్ 17న సారంగని, సౌత్ కోటాబాటో, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సుల లో భూకంపం సంభవించింది. ఇందులో 13 మంది గాయపడ్డారు. 50 కంటే ఎక్కువ ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. 

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న పిలిప్పీన్స్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. దీనిని  ప్రపంచంలో అత్యంత భూకంప, అగ్ని పర్వత క్రియాశీల జోన్ గా యూఎస్ జియోలాజికల్ సర్వే  చెపుతోంది.