గురుకుల సంస్థ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ్ గురుకుల్ డ్రైవ్’

గురుకుల సంస్థ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ్ గురుకుల్ డ్రైవ్’

హైదరాబాద్: TSWREIS ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ్ గురుకుల్ డ్రైవ్’ను నిర్వహించనున్నట్లు సంస్థ సెక్రటరీ రొనాల్డ్ రోస్ తెలిపారు. 05.09.2022 నుంచి 11.09.2022 వరకు వారం రోజుల పాటు ఈ డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 268 గురుకుల పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్, అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని,  సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ సంస్థలను పరిశుభ్రంగా ఉంచడమే డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఏర్పాటు చేసిన థర్డ్ పార్టీ బృందాలు... బెస్ట్ పాఠశాలలను ఎంపిక చేస్తాయని స్పష్టం చేశారు. ఉత్తమ పాఠశాలలకు సంస్థ ఆధ్వర్యంలో అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. 

వారం రోజులపాటు సాగే డ్రైవ్ రోజువారీ కార్యక్రమాలు


1వ  రోజు: రీసైక్లింగ్ కోసం వ్యర్థాలను వేరు చేయడం

2వ రోజు:  తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం, వసతి గృహాలను శుభ్రపరచడం

3వ రోజు: వాష్ రూమ్‌లు, టాయిలెట్‌లు, వాటర్ ట్యాంక్‌లు, డ్రైనేజ్ బ్లాక్‌లు, అవుట్‌లెట్‌లు, వాటర్ లాగింగ్ ఏరియాలను శుభ్రపరచడం. అదేవిధంగా శానిటేషన్ డ్రైవ్ యొక్క ప్రాముఖ్యతపై విద్యార్థులకు పోటీలు

4వ రోజు:  కిచెన్, డైనింగ్ ఏరియాలను శుభ్రపరచడం

5వ రోజు: ప్లాంటేషన్ డ్రైవ్

6వ రోజు: పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు

7వ రోజు: ఘనంగా ముగింపు వేడుకలు