తిరుమల ఘాట్ రోడ్లకు అనుమతిచ్చిన టీటీడీ

తిరుమల ఘాట్ రోడ్లకు అనుమతిచ్చిన టీటీడీ

తిరుమల టు అలిపిరి ఘాట్ రోడ్డులో తిరిగే వాహనాలను అనుమతిచ్చారు టీటీడీ అధికారులు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. భక్తుల సౌకర్యం కోసం ఈ ఒకమార్గంలోనే గంట పాటు కిందికి, మరోగంటపాటు తిరుపతి నుంచి కొండపైకి వాహనాలను అనుమతిస్తున్నారు. భక్తులెవరూ ఫోటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని కోరారు టీటీడీ అధికారులు. భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాటిని తొలగిస్తున్నారు. సాయంత్రం వరకు పరిస్థితిని అంచనా వేసి తిరుమల అప్ మార్గంలోనూ వాహనాలను అనుమతించే విషయంపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.

ఇక భారీ వర్షాల కారణంగా తిరుపతికి వచ్చే పలు రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. నందలూరు-రాజంపేట మధ్య వరద ఉధృతితో మరమ్మత్తులు జరుగుతున్నాయని చెప్పారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ దారి మళ్లించినట్లు తెలిపారు. తిరుపతి నుంచి వెంకటాద్రికి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు పాకాల జంక్షన్ లో రైలు ఎక్కాలంటూ కోరుతున్నారు రైల్వేశాఖ అధికారులు.