టీటీడీకి రూ.14,000 కోట్ల డిపాజిట్లు, 14 టన్నుల బంగారం

టీటీడీకి రూ.14,000 కోట్ల డిపాజిట్లు, 14 టన్నుల బంగారం

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానానికి 960 స్థిర ఆస్తులు ఉన్నాయని, వాటి విలువ రూ.85,705 కోట్లు ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. స్వామివారి పేరుతో 7,123 ఎకరాల భూమి ఉన్నదని, టీటీడీకి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.14,000 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, 14 టన్నుల బంగారం ఉన్నాయని వెల్లడించారు. 1974 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ట్రస్ట్‌ బోర్డులు స్వామివారికి చెందిన113 ఆస్తులను విక్రయించినట్లు తెలిపారు. 2014 తర్వాత ఇప్పటి దాకా తా ము ఎలాంటి ఆస్తులు విక్రయించలేదని, టీటీ డీకి ఉన్న ఆస్తులు, వాటి విలువను టీటీడీ  అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచామని పేర్కొన్నారు.