15 రోజుల్లోనే మళ్లీ తిరుమలలో బ్రహ్మోత్సవాలు

15 రోజుల్లోనే మళ్లీ తిరుమలలో బ్రహ్మోత్సవాలు

తిరుమలలో అక్టోబర్‌లో నిర్వహించే శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను టీటీడీ వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్న కారణంగా ఉత్సవాల ఆరంభం నుంచి ముగింపు రోజు వరకు అష్టాదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు అనుమతిస్తారు.

ALSO READ: తిరుమల శ్రీవారి దర్శనానికి 35 గంటలు

నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్

  •  15న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్ద శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపుతో నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం.
  • 16న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చిన్న శేషవాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు హంస వాహన సేవ.
  •  17న ఉదయం 8-10 గంటల వరకు సింహవాహన సేవ, రాత్రి 7-9 గంటల వరకు ముత్యపు పందిరి.
  •  18న ఉదయం 8-10 గంటల వరకు కల్ప వృక్షవాహన సేవ, రాత్రి 7-9 గంటల వరకు సర్వభూపాల వాహనం సేవ.
  •  19న ఉదయం 8-10 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7-9 గంటల వరకు గరుడ వాహన సేవ.
  •  20న ఉదయం 8-10 గంటల వరకు హనుమద్‌ వాహన సేవ, సాయంత్రం 4 గంటల నుంచి పుష్పక విమాన సేవ, ఆ తర్వాత గజవాహన సేవ.
  •  21 ఉదయం 8-10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ, రాత్రి 7-9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ.
  • 22న ఉదయం 8-10 గంటల వరకు స్వర్ణ రథోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వవాహన సేవ.
  •  23న శ్రీవారికి చక్రస్నానంతో ఉత్సవాల సమాప్తి.