
తిరుపతి : తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. దీపావళి ఆస్థానం నిర్వహించనున్నందున పూజలకు ఇబ్బంది లేకుండా బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇవాళ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని చెప్పిన టీటీడీ.. ఈ మేరకు భక్తులు సహకరించాలని కోరింది.