శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంచనున్న టీటీడీ..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంచనున్న టీటీడీ..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ.. శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంచేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జారీ చేస్తున్న 15 వందల టికెట్లను 2 వేలకు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీవాణి టికెట్లకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో టీటీడీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో ఇటీవలే కీలక మార్పులు చేసింది టీటీడీ.

ప్రస్తుతం శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా జారీ చేస్తోంది టీటీడీ. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి ముందుగా వచ్చినవారికి మొదటి ప్రాధాన్యతగా 800 టికెట్లు జారీ చేస్తున్న టీటీడీ.. రేణిగుంట ఎయిర్ పోర్టులో మరో 200 టికెట్లు, ఆన్ లైన్ ద్వారా 500 టికెట్లు జారీ చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఈరోజుకు ఆరోజే శ్రీవాణి టికెట్లు జారీ చేస్తున్నప్పటికీ రద్దీ  తగ్గకపోవడంతో టీటీడీ ఈమేరకు కీలక మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also read:-తిరుమల కొండపై సైకోగాడు : ATM సెంటర్లలో వైర్లు కట్ చేస్తున్నాడు..!

ఇదిలా ఉండగా.. శనివారం ?( ఆగస్టు 16 ) వీకెండ్ సెలవుల కారణంగా..  తిరుమలలో బీభక్తుల రద్దీ పెరిగింది. దీంతో శ్రీవాణి టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. అర్థరాత్రి సమయం నుంచే శ్రీవాణి టికెట్ల కోసం క్యూ లైన్లలో బారులు తీరారు.. శ్రీవాణి ట్రస్ట్​ దర్శన టిక్కెట్ల కౌంటర్​ దగ్గర గందరగోళ వాతావరణం నెలకొంది.  శ్రీవాణి దర్శన టికెట్ల సమయాన్ని మార్చిన తరువాత అధికారికంగా ఉదయం 10.30 గంటలకు టికెట్లు జారీ చేస్తామని ప్రకటించడంతో.. అర్దరాత్రి నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు.

అయితే భక్తుల తాకిడి ఎక్కువుగా ఉండటంతో  అర్దరాత్రే టికెట్ల విక్రయాలను ప్రారంభించారు. శ్రీవాణి టికెట్లు దొరకని భక్తులు అన్నమయ్య భవనం ఎదుట నిరసన తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువుగా ఉండటంతో రాత్రి క్యూలైన్ల దగ్గర తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న టీటీడీ విజిలెన్స్​ సిబ్బంది భక్తులకు సర్ది చెప్పారు.