ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన పాలకమండలి.. ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం​ తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు గానూ.. శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు. 

వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రోజుకు 30 వేల సర్వ దర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. తాజా నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల సమయం లభించనుంది. వీబీపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో మరింత ఎక్కువ మందికి వెంకన్న దర్శన భాగ్యం కలిగే అవకాశముందని టీటీడీ అభిప్రాయపడింది.

మరిన్ని వార్తల కోసం:

‘భీమ్లా నాయక్’పై ఆర్జీవీ, నారా లోకేశ్ ట్వీట్లు

ఒకవైపు యుద్ధం.. మరోవైపు షూటింగ్

ఈ కుంభకర్ణుడు.. పడుకుంటే పోతాడు!