ఒకవైపు యుద్ధం.. మరోవైపు షూటింగ్

ఒకవైపు యుద్ధం.. మరోవైపు షూటింగ్

కీవ్: ఉద్రిక్తతలతో ఉక్రెయిన్ అట్టుడుకుతోంది. రష్యా దాడులతో అక్కడి ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ క్షణం ప్రాణాలు కాపాడుకుంటే చాలు, యుద్ధభూమికి దూరంగా వెళ్లిపోయి క్షేమంగా మిగిలితే అదే పదివేలు అనుకుని నగరాలు విడిచి పారిపోతున్నారు. అయితే ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ప్రముఖ ఫిల్మ్ మేకర్, నటడు సీన్ పెన్ మాత్రం డాక్యుమెంటరీ తీస్తున్నాడు. యుద్ధ వాతావరణంలోనే డాక్యుమెంటరీ పనులను కొనసాగిస్తానని అంటున్నాడు. ఈ విషయంపై ఉక్రెయిన్ ప్రభుత్వం స్పందించింది. 

రష్యా దాడులను, తమ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై సీన్ పెన్ డాక్యుమెంటరీ తీస్తుండటం నిజమేనని ఉక్రెయిన్ వెల్లడించింది. దీనికి సంబంధించి తమ దేశ ప్రభుత్వ అధికారులు, నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ లకు పెన్ హాజరవుతున్నారని తెలిపింది. అలాగే డిప్యూటీ పీఎం ఇరినా వెరెశుక్ తోపాటు మిలిటరీ ఆఫీసర్లు, జర్నలిస్టులను కలసి యుద్ధం గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారని ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేసింది. తమ దేశంలో నెలకొన్న పరిస్థితులను, ప్రతి విషయాన్ని రికార్డ్ చేసేందుకు సీన్ పెన్ ప్రత్యేకంగా వచ్చారని ఉక్రెయిన్ పేర్కొంది.తమపై దాడులకు దిగుతున్న రష్యా నిజస్వరూపాన్ని ప్రపంచాన్ని తెలియజేయాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో సీన్ పెన్ చూపిస్తున్న తెగువ అసామాన్యమైనదని.. పలువురు పశ్చిమ దేశాధినేతలతో పోల్చుకుంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని వివరించింది. 

మరిన్ని వార్తల కోసం:

అమాయక ప్రజల్ని చంపుతున్నరు

ఈ కుంభకర్ణుడు.. పడుకుంటే పోతాడు!

‘భీమ్లానాయక్’ కారణంగా మరో మూవీ వాయిదా