‘భీమ్లా నాయక్’పై ఆర్జీవీ, నారా లోకేశ్ ట్వీట్లు

‘భీమ్లా నాయక్’పై ఆర్జీవీ, నారా లోకేశ్ ట్వీట్లు

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్​, హ్యాండ్సమ్ హంక్ రానా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి అప్లాజ్ వస్తోంది. పవన్ కు ఇది మరో బ్లాక్ బస్టర్ అని.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి సినిమా అంటూ టాలీవుడ్ వర్గాలు, సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ మూవీపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. భీమ్లా నాయక్ ఓ భూకంపం అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘భీమ్లా నాయక్ ఓ ఉరుము. పవన్ కల్యాణ్​ ఒక సునామీ. రానా ఢీ అంటే ఢీ అనేలా నటించాడు. మొత్తానికి ఇదో భూకంపం’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. 

ఈ చిత్రంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. భీమ్లా నాయక్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోందని.. ఈ సినిమాను చూసేందకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘భీమ్లా నాయక్ మూవీని చూసేందుకు ఎదురు చేస్తున్నా. రాష్ట్రంలోని ఒక్కో రంగాన్ని నాశనం చేయడం ద్వారా వైఎస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ ను భిక్షా పాత్రలా మారుస్తున్నారు. సినీ పరిశ్రమనూ ఆయన మినహాయించ లేదు. ఇలాంటి కుట్రలను అధిగమించి భీమ్లా నాయక్ గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తల కోసం:

ఒకవైపు యుద్ధం.. మరోవైపు షూటింగ్

అమాయక ప్రజల్ని చంపుతున్నరు

ఈ కుంభకర్ణుడు.. పడుకుంటే పోతాడు!