తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం

తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవానం నుంచి తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం విధించింది. దుకాణదారులు, హోటళ్లు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామన్నారు టీటీడీ అధికారులు. దుకాణదారులు ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అలిపిరి టోల్ గేట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తామని... ప్లాస్టిక్ రహిత వస్తువులనే కొండపైకి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది.  దుకాణదారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు తమకు సహకరించాలని టీటీడీ కోరింది. టీటీడీ చాలా రోజులుగా తిరుమలలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు చెప్పింది. దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో జూన్-1 నుంచి తిరుమలలో ప్లాస్టిక్ అనుమతించరని.. అలిపిరి టోల్ గేట్ దగ్గరే తనిఖీలు చేస్తారని చెప్పారు టీటీడీ అధికారులు.

మరిన్ని వార్తల కోసం

ట్రెండ్ సెట్టర్.. సూపర్ స్టార్ కృష్ణ 52 ఏళ్ల సినీ ప్రస్థానం

కృష్ణా నీళ్లు ఆంధ్రకు.. గోదావరి జలాలు కాంట్రాక్టర్లకు