తిరుమల శ్రీవారి బంగారంతో మంగళసూత్రాలు తయారీ : టీటీడీ సంచలన నిర్ణయం

తిరుమల శ్రీవారి బంగారంతో మంగళసూత్రాలు తయారీ : టీటీడీ సంచలన నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆ వేంకటేశ్వరస్వామికి కానుకుల రూపంలో వస్తున్న కిలోల కొద్దీ బంగారాన్ని మరో రూపంలో భక్తులకే అందే విధంగా ప్రణాళిక రచించింది. శ్రీవారికి వచ్చే బంగారాన్ని మంగళసూత్రాలుగా తయారు చేసి.. వాటిని స్వామి వారి పాదాల దగ్గర పూజ చేసి.. భక్తులకు విక్రయించాలనే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తిరుమల వేంకటేశ్వరస్వామికి కోట్ల మంది భక్తులు ఉన్నారు. కొత్తగా పెళ్లయిన ప్రతి జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీ. అలాంటిది.. తిరుమల వెంకన్న పాదాల చెంత పూజలు అందుకునే మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. శ్రీవారికి కానుకల రూపంలో వచ్చే బంగారాన్ని.. మంగళసూత్రాలుగా తయారు చేసింది.. పూజ చేసి.. భక్తులకు విక్రయించాలని నిర్ణయించింది టీటీడీ..

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chiarman Bhumana Karunakar Reddy) అధ్యక్షతన సోమవారం  ( జనవరి 29) జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.5 వేల 141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్‌కి ఆమోదం తెలియజేశారుటీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ కార్మికులను గుర్తించమని…వారి జీతాన్ని 15 వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.

పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి (TTD Chairman bhumana karunakar reddy) మీడియాతో నిర్ణయాలను వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి లేఖ రాసినట్లు చెప్పారు. గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు, నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయింపుకు ఆమోద ముద్ర వేశామన్నారు. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు. ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజీల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించామన్నారు.

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని చేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు. 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరువుతున్నారన్నారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.

వాటర్ వర్క్స్. అన్నప్రసాదం, వేదపాఠశాలలో ఉద్యోగులు, టీటీడీ స్టోర్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు భూమన తెలిపారు. వేదపండితుల పెన్షన్ 10 వేలు నుంచి 12 వేలుకు పెంచారన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతామన్నారు. 56 వేదపారాయణదారులు పోస్టులు నియామకానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకరించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతు తీర్మానం చేశామన్నారు.అటవీశాఖ ఉద్యోగుల సమస్య గురించి   ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ తెలిపారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం పట్ల పాలకమండలి సానుకూలంగా ఉందన్నారు.

అంచనా ఆదాయం

హుండి ద్వారా 1611 కోట్లు, వడ్డి ద్వారా 1,167 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లు,దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు వస్తూందని అంచనా వేశామన్నారు. జీతాలు చెల్లింపునకు 1.733 కోట్లు, ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు, కార్పస్ ఫండ్‌కుకి 750 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

విభాగాల వారీగా కేటాయింపులు ఇలా..

  • ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కోట్లు

  • హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు రూ.108.50 కోట్లు

  • వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు

  • రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం రూపంలో రూ.50 కోట్లు

  • టీటీడీ విద్యాసంస్థలు, వివిధ వర్సిటీలకు గ్రాంట్స్ రూ.173.31 కోట్లు

  • పారిశుద్ధ్య విభాగానికి రూ.261.07 కోట్లు

  • నిఘా, భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు

  • వైద్య విభాగానికి రూ.241.07 కోట్లు

టీటీడీ 2024-25 వార్షిక బడ్జెటుకు రాబడి వివరాలు, కీలక నిర్ణయాలు

  • హుండీ ఆదాయం రూ.1611 కోట్ల అంచనా..

  • బ్యాంకు డిపాజిట్ల వడ్డీల ద్వారా రూ.1068.51 కోట్ల అంచనా..

  • లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.550 కోట్లు..

  • దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.468 కోట్ల అంచనా..

  • గదుల వసతి సౌకర్యం ద్వారా రూ.142 కోట్లు..

  • పుస్తకాల విక్రయాల ద్వారా రూ.35.25 కోట్లు..

  • అగర్బత్తి, టోల్ గేట్, విద్య కళాశాల ద్వారా రూ.74.50 కోట్లు..

  • కళ్యాణ కట్ట ద్వారా రూ.226.50 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.

    అభివృద్ది పనులు

  • స్విమ్స్ అస్పత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపుకు రూ.148 కోట్లతో టెండర్ ఆమోదం..

  • రూ.2.5 కోట్లతో సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులు..

  • ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు మంజూరు.

  • టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఆమోదం.

  • అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ.1.47 కోట్లు కేటాయింపు