
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీచేసింది. శ్రీవాణి టికెట్ల దర్శనం విషయంలో కీలక మార్పులు తీసుకొచ్చారు టీటీడీ అధికారులు. ముఖ్యంగా ముఖ్యంగా NRI భక్తులు ఈ విషయాన్ని మరీ మరీ గుర్తించుకోవాలి..
తిరుమలలో శ్రీవాణి టికెట్ రూల్స్, దర్శన టైమింగ్స్ మారిపోయాయి. గతంలో శ్రీవాణి టికెట్లను ముందుగా బుక్ చేసుకునే వారు.. ఇప్పుడు అలా లేదు.. ఏ రోజు టికెట్లు ఆ రోజు ఇస్తారు.. అదే రోజు దర్శనం.. గతంలో ఉదయం పూట ఉండే దర్శనం.. ఇప్పుడు సాయంత్రానికి మారింది. ఉదయం టికెట్ల జారీ ఉంటే.. సాయంత్రం శ్రీవాణి టికెట్ దర్శనం ఉంటుంది..
శ్రీవారిని దర్శించుకోవాలని.. విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. 2025, ఆగస్ట్ ఒకటో తేదీ నుంచే ఈ రూల్స్ మారాయి.. . ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని.. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా పరిశీలించారు.. విధానాన్ని పర్యవేక్షించారు..
తిరుమల శ్రీవాణి టికెట్ల దర్శనం సమయాల్లో మార్పులు జరిగాయి. ఆగస్టు 1 నుంచి సాయంత్రం 5 గంటలకు శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని టీటీడీ తెలిపింది. ఈ క్రమంలో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల విక్రయ కేంద్రాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. సేల్స్ కౌంటర్ దగ్గర అధికారులు ఏర్పాటు చేసిన వసతుల గురించి ఆరా తీశారు. వృద్దులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు.
తిరుమలలో అద్దె గదుల సమస్యతో, టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం టికెట్ తీసుకొని...అదేరోజు సాయంత్రం స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఆఫ్‌లైన్ విధానంలో తిరుమలలో 800 టిక్కెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్టులో 200 టిక్కెట్లు జారీ చేస్తున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఉదయం 7 గంటల నుంచి, తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి టిక్కెట్లు జారీచేయనున్నారు. ఈ విధానాన్ని ఆగస్టు 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. శ్రీవాణిదర్శన టికెట్లను ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్లు పొందిన భక్తులను ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు.