నేనేమీ రైల్వే మంత్రిని కాదు.. మహిళా ప్రయాణికురాలితో టికెట్ కలెక్టర్

నేనేమీ రైల్వే మంత్రిని కాదు.. మహిళా ప్రయాణికురాలితో టికెట్ కలెక్టర్

జనాలు ప్రయాణం చేయాలంటే ఎక్కువుగా ట్రైన్​ జర్నీని ప్రిఫర్​ చేస్తుంటారు.  రిజర్వేషన్​ లేకపోయినా చాలా మంది రైలులోనే ప్రయాణిస్తారు.  సహజంగా రైళ్లలో రద్దీ ఎక్కువుగా ఉంటుంది.  పీక్​సీజన్​ లో అయితే చెప్పే పనే లేదు.  ఒక్కోసారి రైలు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతుంటారు.. వాష్ రూంకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉండదు.  తాజాగా రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తాను పడిన ఇబ్బందిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వైరల్​ అవుతున్న వీడియో వివరాల ప్రకారం 22969 OKHA BSBS SF EXP (ఓఖా నుండి కాన్పూర్ సెంట్రల్) రైలులో ఓ యువతి ప్రయాణిస్తున్న కోచ్​ బాగా రద్దీగా ఉందని.. అందులో మహిళలు ఎవరూ లేరని .. అందరూ అబ్బాయిలే ఉన్నారని.. తాను ప్రయాణం చేయడం చాలా కష్టంగా.. అసౌకర్యంగా ఉందని .. తన కోచ్​ మార్చాలంటూ  టీటీఈని అభ్యర్థించింది.  అయితే టీటీఈ  మాత్రం తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా..  ఆయువవతి వ్యంగ్యంగా సమాధానం చెప్పాడని పేర్కొంది.  ఈ విషయంలో నేను ఏమీ చేయలేను.. నేను రైల్వే మంత్రిని కాదు.. అదనపు రైళ్లను నడపలేను.. అంటూ ఆ యువతికి సమాధానం ఇచ్చాడు.  టీటీఈ ఇచ్చిన సమాధానికి ఆ మహిళ స్పందిస్తూ.. రైల్వే అధికారులు వారి భద్రత గురించే ఆందోళనలో ఉన్నారని... మహిళా ప్రయాణికుల భద్రత గురించి ఏం పట్టించుకుంటారని సమాధానం ఇచ్చింది.
 

రైలు ప్రయాణికుల ఇబ్బందుల  గురించి సోషల్​ మీడియాలో చాలా వీడియోలు వైరల్​అయ్యాయి.  ఇటీవల ట్రైన్​ కోచ్‌లలోని టాయిలెట్​ లకు వెళ్లే అవకాకాశం లేకుండా జనాలు రద్దీ ఉందని ప్రయాణికులు రైల్వే ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. రద్దీ కారణంగా సాధారణ కంపార్ట్‌మెంట్లలోని టాయిలెట్లలో కూర్చున్న వ్యక్తులను చూపించే వీడియో వైరల్ అయ్యింది. నాన్-ఏసీ కంపార్ట్‌మెంట్లలో రద్దీ సమస్య చాలా కాలంగా ట్రైన్​ ప్రయాణికులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు