
కోర్ట్ ఫేమ్' హర్ష రోషన్, సలార్ ఫేమ్' కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోదాటి లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘టుక్ టుక్’ (Tuk Tuk).ఈ ఏడాది మార్చి21న థియేటర్లలో రిలీజైంది.
అయితే, ఇపుడీ ఈ తెలుగు హారర్ కామెడీ మూవీ ఓటీటీకి వచ్చి ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఇంతలా ఆకట్టుకునే ఈ ‘టుక్ టుక్’ మూవీ కథేంటీ? ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది? అనేది తెలుసుకుందాం.
‘టుక్ టుక్’ ఓటీటీ:
సుప్రీత్ సి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఈటీవీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చి దుమ్మురేపుతోంది. ప్రస్తుతం టాప్ 10 మూవీస్ లో ఒకటిగా కొనసాగుతోంది. ప్రైమ్ వీడియోలో 100 మిలియన్‌కు పైగా స్ట్రీమింగ్ మినట్ వ్యూస్‌ను దక్కించుకొని రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇటీవల కాలంలో చిన్న సినిమాల్లో హయ్యెస్ట్ వ్యూస్‌ను దక్కించుకున్న సినిమా ఇదే!
దర్శకుడు సుప్రీత్.. హారర్ ఎలిమెంట్స్‌కు స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన ఓ మెసేజ్‌ను జోడించి ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో ఓ బండిని ప్రధానంగా చేసుకుని, అందులో ఆత్మ ఉండటం, అది చేసే విన్యాసాలతో.. కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటోంది. ఇలా ఓ బండిలోని ఆత్మ కారణంగా ముగ్గురు స్నేహితుల జీవితాలు ఎలాంటి సమస్యలతో నడిచింది అనేది ఆసక్తిగా చూపించారు. టుక్ టుక్ మూవీ IMDBలో 9.7 రేటింగ్‌ను దక్కించుకున్నది.
Chala days tarwatha heartfully navvukunna 🤣🤣
— мαѕтєя ©7 👽 👽 (@the_masterjd1) May 30, 2025
Manchi Entertainment movie ❤️#TukTuk pic.twitter.com/XyS18sICVm
‘టుక్ టుక్’ కథ:
రాయలసీమలోని ఓ పల్లెటూరి. ఈ ఊరిలో ఓ ముగ్గురు కుర్రాళ్లు. అల్లరి చేష్టలతో సరదాగా లైఫ్ ను ఎంజాయ్ చేసే వీరు.. సడెన్ ఓ షార్ట్‌ఫిల్మ్‌లు తీయాలని డిసైడ్ అవుతారు. అందుకు కావాల్సిన డబ్బుల కోసం తీరొక్క ఆలోచనలతో ముందుకెళ్తారు. ఈ క్రమంలోనే ఓ కెమెరా కొనాలని అనుకుంటారు. అందుకు కావాల్సిన డబ్బులను సంపాదించడానికి ఓ ఇంట్రెస్టింగ్ ప్లాన్ ఎస్టాబ్లిష్ చేస్తారు.
అదేంటంటే.. ఆ డబ్బుల కోసం వినాయక విగ్రహం ఏర్పాటు పేరుతో చందాలు వసూలు చేయాలని డిసైడ్ అవుతారు. ఇక ఆ దేవుడి ఊరేగింపుకు బండి అవసరం ఉంటుంది కాబట్టి..ఓ పాత కాలం నాటి స్కూటర్‌ను ఆటోలా అందంగా రీ మోడలింగ్ చేస్తారు. అయితే, అలా ఆ బండిలో దేవుడున్నాడంటూ ప్రచారం కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకు జనాల్ని నమ్మించడానికి కొన్ని జిమ్ముక్కులతో ఏదైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయో లేదో హ్యాండిల్ అటూ ఇటూ ఉపుతూ బండి చెబుతుంటుందని చెబుతారు.
ALSO READ : థగ్ లైఫ్ మూవీ విడుదలపై KPCC నిషేధం.. హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్
అయితే, అది నిజంగానే తిరగడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే.. ఆ బండిలో ఉన్నది దేవుడు కాదు. దెయ్యం అని విషయం బయటపడుతుంది. మరి ఆ దెయ్యం బండిలోకి ఎలా వచ్చింది? అసలు ఆ ఆత్మకు శిల్ప (శాన్వీ మేఘన) అనే అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ బండి వచ్చాకా ఆ ముగ్గురి జీవితాలు ఎలా మారతాయి? చివరకి వీరు అనుకున్న కెమెరా కొంటారా? లేదా అనేది మిగతా కథ.