తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలి: తుమ్మల

తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలి: తుమ్మల

తెలంగాణ కలసాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం బలపరిచేలా ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని తుమ్మల పిలుపునిచ్చారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఖమ్మంలో అరాచకపాలనను అంతమోందించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అహంకారంకు ఖమ్మం ప్రజల ప్రతిష్టకు మధ్య జరిగే ఎన్నికలు ఇవని తుమ్మల అన్నారు.

Also Read :- యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

చరిత్రని మార్చలేరు ఖమ్మం అభివృద్ధిలో నా పాత్ర ఏంటో ప్రజానికానికి తెలసుసని తుమ్మల అన్నారు. ఖమ్మంలో తాగు నీటి కష్టాలు లేకుండా పిల్టర్ బెడ్స్ నిర్మాణంతో.. ట్యాంకర్లకు బదులు ట్యాప్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖమ్మం పట్టణంలోని హరివిల్లు అపార్ట్మెంట్ వాసులతో తుమ్మల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా అపార్ట్మెంట్ వాసులతో ఆయన మాట్లాడారు.