‘బేడియా’ చిత్రం నుంచి ‘తుంకేశ్వరి’ అనే సాంగ్ రిలీజ్

‘బేడియా’ చిత్రం నుంచి ‘తుంకేశ్వరి’ అనే సాంగ్ రిలీజ్

వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బేడియా’. అమర్ కౌశిక్ దర్శకుడు. జియో స్టూడియోస్ సమర్పణలో దినేష్ విజాన్ నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తెలుగులో ‘తోడేలు’ టైటిల్‌‌‌‌తో నవంబర్ 25న రిలీజ్ చేయనున్నారు.  తాజాగా ఈ మూవీ నుంచి ‘తుంకేశ్వరి’ అనే తెలుగు పాటను విడుదల చేశారు. . ‘వలచిన చెలియ కథ..  చేరువ వచ్చి తోడువయ్యవా. కలిసిన మనసు కథ.. కోరి వచ్చి నీడవయ్యవా’ అంటూ సాగిన ఈ స్పెషల్‌‌‌‌లో సాంగ్‌‌‌‌లో వరుణ్, కృతి స్టెప్స్ హైలైట్‌‌‌‌గా ఉన్నాయి.  

సచిన్ జిగర్ ట్యూన్ చేయగా, యనమండ్ర రామకృష్ణ  లిరిక్స్ రాశారు. కార్తీక్,అనూష మణి కలిసి పాడారు. గణేష్ ఆచార్య డ్యాన్స్ కంపోజ్ చేశారు.  పాట రిలీజ్ సందర్భంగా  వరుణ్ మాట్లాడుతూ ‘ఫ్లోర్ అదిరిపోయే డాన్స్ నెంబర్ ఇది. ఈ పాటలో పెర్ఫార్మ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను.  థియేటర్‌‌‌‌‌‌‌‌లో ఆడియెన్స్ స్టెప్పులేస్తారు’ అన్నాడు.  కృతి సనన్ మాట్లాడుతూ ‘వరుణ్‌‌‌‌కి జోడీగా  ఇలాంటి పాటలో కనిపించి చాలా రోజులవుతోంది. షూటింగ్ టైమ్‌‌‌‌ను ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి ఎక్స్‌‌‌‌పీరియెన్స్’ అని చెప్పింది.