టర్కీకి ఎస్-400 మిస్సైల్ సిస్టమ్​వచ్చేసింది

టర్కీకి ఎస్-400 మిస్సైల్ సిస్టమ్​వచ్చేసింది

అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎస్​–400 మిస్సైల్​డిఫెన్స్​సిస్టమ్​ను టర్కీ దిగుమతి చేసుకుంటోంది. శనివారం ఎస్​400 మిస్సైల్ ట్రక్స్​ను మోసుకొచ్చిన నాలుగో కార్గో విమానం అంకారాలో దిగింది. అందులోంచి ట్రక్కులను దింపుతున్న ఫొటోను టర్కీ రక్షణ మంత్రి ట్వీట్​చేశారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డిఫెన్స్​ సిస్టమ్​ వచ్చేసిందని కామెంట్​చేస్తూ ఈ ఫొటోను షేర్​చేశారు. రష్యాతో టర్కీ కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా మండిపడుతోంది. ఆ డీల్​ను కేన్సల్​ చేసుకోవాలని పదే పదే హెచ్చరించింది. నాటో సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని ట్రంప్​ పరోక్షంగా హెచ్చరించినా టర్కీ లెక్క చేయలేదు. రక్షణ శాఖకు అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవడం తమ దేశపు హక్కులకు సంబంధించిన విషయమని, ఎవరి బెదిరింపులకు తలొగ్గేదిలేదని స్పష్టంచేసింది.