జర్నలిజం పేరుతో రాజకీయాలు చేయొద్దు

జర్నలిజం పేరుతో రాజకీయాలు చేయొద్దు

జర్నలిజం పేరుతో రాజకీయ నాయకుల కుటుంబాలను వీధిలోకి లాగడం సరియైనది కాదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది.  తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ లో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు బాడి షేమింగ్ చేస్తూ పోల్ నిర్వహించడం అప్రజాస్వామికమైందని అన్నారు TUWJ అధ్యక్షులు అల్లం నారాయణ. ఇది జర్నలిజం విలువలకు పూర్తిగా విరుద్ధమైనదని..ఇది పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడంగా భావిస్తూ జర్నలిస్టులు అయిన వారందరూ కూడా ఈ భాషకు దూరంగా ఉండాలని కోరారు. విలువలకు కట్టుబడి ఉండాలని..కేటీఆర్ కుమారుడిని వివాదంలోకి లాగడాన్ని TUWJ సంఘం ఖండించింది.

మరిన్ని వార్తల కోసం..

 

కేంద్రం పై కేసీఆర్ అసత్య ప్రచారం