- మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి
మహబూబ్ నగర్: కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని, వెంటనే తన అసత్య ప్రచారాన్ని మానుకోవాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీకి పోయిన మంత్రుల బృందం జోకర్లు అయ్యారని, అధికారులను పంపించాలనే సోయి తెలంగాణ సీఎంకు లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
కమీషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ఆయన విమర్శించారు. కేంద్రం ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉందని, ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యతను కేసీఆర్ విస్మరించారని ఆయన ఆరోపించారు. ఒకవైపు కోటి ఎకరాల్లో పంట సాగు చేస్తామంటూనే... అభాండాలు మోపుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్సీఐ గోడౌన్, రైల్వే వ్యాగన్ల పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారుని, కేవలం మంత్రులను శిక్షించడానికే ఢిల్లీ నాటకం ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇంత కాలం లేనిది ఇప్పుడీ రాజకీయం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ లో బీజేపీకి ప్రజాదరణ స్పష్టంగా వెల్లడైందని, ప్రభుత్వ వైఫల్యాలు తట్టు కోలేకే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం, కుటిల రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం చురుకుగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తప్పు లను ఎండగడుతామని, బీజేపీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. త్వరలోనే కేసీఆర్ బండారం బయట పెడుతం అని జితేందర్ రెడ్డి వెల్లడించారు.
మరిన్ని వార్తల కోసం..
దేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు
కేంద్రం పై కేసీఆర్ అసత్య ప్రచారం