
టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎన్‌టార్క్ 125 స్కూటర్ కొత్త వేరియంట్‌ను మార్వెల్ సూపర్ హీరో కెప్టెన్ అమెరికా నుంచి స్ఫూర్తి పొంది పరిచయం చేసింది. ఈ ఎడిషన్‌ను సూపర్ స్క్వాడ్ సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చింది. గతంలో ఐరన్ మ్యాన్, స్పైడర్-మ్యాన్ వంటి పాత్రల స్ఫూర్తిగా కూడా ఎన్‌టార్క్‌ను తీసుకొచ్చింది. మెకానికల్‌గా బండికి ఎటువంటి మార్పులు చేయలేదు.
ఈ స్కూటర్‌లో 124.8 సీసీ సింగిల్ -సిలిండర్ ఇంజన్ 9.37 బీహెచ్‌పీ పవర్, 10.6 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8.9 సెకన్లలో 0–-60 కిమీ/గం వేగం అందుకుంటుంది. స్మార్ట్ ఎక్స్‌నెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కాలర్ ఐడీ, రైడ్ డేటా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ ధర రూ.98,117 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).