
- 18లోగా ఆప్షన్లు ఇవ్వాలని కమిషనర్ అజయ్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని హాస్పిటల్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ల సర్దుబాటు కోసం టీవీవీపీ కమిషనర్ డాక్టర్ జె. అజయ్ కుమార్ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జిల్లా హాస్పిటల్స్‌ను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ (జీజీహెచ్)గా మార్చడంతో, అక్కడ పనిచేస్తున్న 480 మంది సివిల్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు (సీఎస్ఆర్ఎంవో), సివిల్ సర్జన్ (డెంటల్) కేడర్ డాక్టర్లను తిరిగి టీవీవీపీ హాస్పిటల్స్‌లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సర్దుబాటు ప్రక్రియ హైకోర్టు ఆదేశాల మేరకే చేపడుతున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జీజీహెచ్‌లలో పనిచేస్తున్న అర్హులైన డాక్టర్లు తమకు కావాల్సిన ఐదు టీవీవీపీ హాస్పిటల్స్‌ను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకుని, ఎంప్లాయీ ప్రిఫరెన్స్ ఫారం నింపి ఈ నెల 18వ తేదీలోపు సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.