గ్లోబల్ టాప్ 250 చిత్రాల జాబితాలో ట్వల్త్‌‌ ఫెయిల్‌‌

గ్లోబల్ టాప్ 250 చిత్రాల జాబితాలో ట్వల్త్‌‌ ఫెయిల్‌‌

విక్రాంత్‌‌ మస్సే లీడ్ రోల్‌‌లో విధు వినోద్‌‌ చోప్రా తెరకెక్కించిన చిత్రం  ‘ట్వల్త్‌‌ ఫెయిల్‌‌’. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ బాలీవుడ్ మూవీ బ్లాక్ బస్టర్‌‌‌‌ హిట్‌‌ను సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మనోజ్ కుమార్ అనే ఐపిఎస్‌‌ ఆఫీసర్‌‌‌‌ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.

తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన ఘనతను సాధించింది. ఇంటర్నెట్‌‌ మూవీ డేటాబేస్‌‌ సంస్థ (ఐఎమ్‌‌డీబీ) గ్లోబల్ టాప్ 250 చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 50వ చిత్రంగా నిలిచింది ‘ట్వల్త్‌‌ ఫెయిల్‌‌’. ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. దర్శకుడు విధు వినోద్ చోప్రా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

‘ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా చనిపోయినా పర్వాలేదనిపిస్తోంది’ అంటూ విధు వినోద్ చోప్రా సంతోషం వ్యక్తం చేశారు. ఐఎమ్‌‌డీబీ అత్యధిక రేటింగ్‌‌ను పొందిన భారతీయ సినిమాల లిస్టులో ఇప్పటికే టాప్‌‌ ప్లేస్‌‌ను ఈ చిత్రం దక్కించుకుంది.