
ఆ ఇద్దరు కవల పిల్లలు. కానీ, వాళ్ల పుట్టిన టైం, పుట్టిన తేదీ, సంవత్సరం, దశాబ్దం ఒక్కటి కాదు. అవును, ఆ కవల పిల్లలు వేర్వేరు తేదీలు, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. ఎలాగో తెలుసా..? ఒకరు కొత్త సంవత్సరానికి ముందు, మరొకరు కొత్త సంవత్సరం ఎంటరయ్యాక అరగంట తేడాతో పుట్టారు కాబట్టి. అందులో ముందు అమ్మాయి పుడితే, తర్వాత అబ్బాయి పుట్టాడు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న పెండెల్టన్కు చెందిన డాన్ జిలియం, జేసన్ టెలోలు భార్యాభర్తలు. నిజానికి జిలియంకు ఫిబ్రవరి 19న డేట్ ఇచ్చారు. కానీ, కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోవడంతో వెంటనే జిలియంను డిసెంబర్ 31న స్థానికంగా ఉన్న ఎషెన్సన్ సెయింట్ విన్సెంట్ కార్మెట్ హాస్పిటల్కు తీసుకెళ్లాడు ఆమె భర్త జేసన్. డాక్టర్లు ఆమెను పరీక్షించి, కాన్పుకు సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆమెకు వేర్వేరు తేదీల్లో జోస్లిన్ టెలో, జాక్సన్ టెలో అనే కవలలు పుట్టారు. జోస్లిన్ 2019 డిసెంబర్ 31న రాత్రి 11.37 గంటలకు పుడితే, జాక్సన్ సరిగ్గా అరగంట తర్వాత 2020 జనవరి 1న పుట్టాడు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. జోస్లిన్ 2.12 కిలోలుంటే, జాక్సన్ 2 కిలోలున్నాడు. 2019తో ఒక దశాబ్ధం ముగియగా.. 2020 నుంచి కొత్త దశాబ్ధం స్టార్ అయింది. దీంతో అర గంట తేడాతో కవలలిద్దరూ చెరో డికేడ్‌లో పుట్టి రికార్డ్ సృష్టించారు.