
న్యూఢిల్లీ; ట్విటర్ కొత్త సీఈఓ పరాగ్ అగర్వాల్ ఏటా రూ. 7.5 కోట్ల (మిలియన్ డాలర్ల) జీతం అందుకోనున్నారు. 2011లో ట్విటర్లో జాయినయిన పరాగ్ అగర్వాల్ 2017లో సీటీఓగా ప్రమోట్ అయ్యారు. ట్విటర్ టెక్నికల్ స్ట్రాటజీలో పరాగ్ అగర్వాల్దే ముఖ్యమైన పాత్ర. జీతానికి అదనంగా 150 % బోనస్ కూడా ఉంటుందని ట్విటర్ తెలిపింది. 1.25 కోట్ల స్టాక్ ఆప్షన్లను కంపెనీ ఆయనకు ఇస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 16 ఈక్వల్ క్వార్టలీ ఇంక్రిమెంట్లుగా పరాగ్ ఈ షేర్లను పొందవచ్చని ట్విటర్ యూఎస్ ఎస్ఈసీకి వెల్లడించింది.