సోషల్ మీడియా మహానుభావులు : తాత నువ్వేం బాధపడకు నీకు మేం ఉన్నాం

సోషల్ మీడియా మహానుభావులు : తాత నువ్వేం బాధపడకు నీకు మేం ఉన్నాం

ఒక్క బుల్లెట్ పేలకుండా.. ఒక్క బాంబు విసరకుండా ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ లోకి వెళ్లిపోయేలా చేసిన ఘ‌న‌త క‌రోనాకే ద‌క్కుతుంది. ఎవ‌రి ప‌రిస్థితి ఎలా ఉన్నా ధ‌నవంతులు మ‌రింత ధ‌న‌వంతులుగా పేద‌వాళ్లు మ‌రింత పేద‌వారిగా మిగిలిపోతున్నారు.

ఇటీవ‌ల ఇండియా ఇన్ఫోలైన్ విడుద‌ల చేసిన  ఇండియా రిచ్ లిస్ట్ 2020 ప్ర‌కారం రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ గంట‌కు 90కోట్లు అంటే నిమిషానికి కోటిన్నర సంపాదిస్తున్నారు. అదే ఓ చిరు వ్యాపారి 8గంట‌లు క‌ష్ట‌ప‌డితే 50రూపాయ‌లు కూడా సంపాదించ‌డం క‌ష్టంగా మారింది.

సౌత్ ఢిల్లీ మాళ‌వీయ న‌గ‌ర్ ప్రాంతంలో  వృద్ద దంప‌తులు  80 ఏళ్ల ప్ర‌సాద్, దేవీలు బాబా కా దాబా అనే ఓ చిన్న దాబాను  గ‌త 30ఏళ్లుగా  న‌డిపిస్తున్నారు. క‌రోనాకు ముందుకు దాబా న‌డ‌ప‌గా వ‌చ్చే నెల‌స‌రి ఆదాయం 4000వేల నుంచి 5000వేలు ఉండేది. కానీ ప‌రిస్థితి మారింది. క‌రోనా వ‌ల్ల స్థానికులు ఆదాబాలో తిన‌డం మానేశారు.

ఈ నేప‌థ్యంలో ఢిల్లీకి చెందిన గౌర‌వ్ వాస‌న్ అనే ఫుడ్ బ్లాగ‌ర్ . బాబాకా దా బాబా లో రోటీ త‌యారు చేస్తున్న ప్ర‌సాద్ ను ఏం తాత ఎలా ఉన్నావ్. బిజినెస్ ఎలా న‌డుస్తుంది అంటూ వారితో మాట క‌లిపాడు. మాట్లాడుతూనే వాళ్లు చేసిన ఫుడ్ ఐట‌మ్స్ అన్నీ టేస్ట్ చేశాడు. చాలా బాగున్నాయి.

మాట‌ల మ‌ధ్య‌లో తాత క‌రోనా త‌రువాత ప‌రిస్థితి ఎలా ఉందో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ రోజు బిజినెస్ ఎంత అయ్యిందంటూ కుతూహులంగా యూట్యూబ‌ర్ గౌర‌వ్ తాత‌ను అడిగాడు. తాత గ‌ల్లాపెట్టెలో ఉన్న 50 రూపాయ‌ల్ని చూపిస్తూ క‌న్నీటి ప‌ర్యంత‌ర‌మ‌య్యాడు. దీంతో బ‌రువెక్కిన హృదయంతో గౌర‌వ్ తాత‌ను ఓదార్చే ప్ర‌య‌త్నం చేశాడు.

తాత నువ్వేం కంగారు పడకు అంటూ.. దాబా గురించి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే ఆ వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. వృద్ద దంప‌తుల గురించి ఢిల్లీ నుంచి గ‌ల్లీ దాకా మారు మోగింది. ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్ లు ఆ దంప‌తుల్ని ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చాయి. సినీ ప్ర‌ముఖులు, క్రికెట‌ర్లు వారికి అండ‌గా నిలిచారు. స్థానిక ఎమ్మెల్యే వారికి ఆర్ధిక సాయం అందించారు. ఇప్పుడు బాబా కా దాబా పేరుతో యాష్ ట్యాగ్ వైర‌ల్ అవుతుంది.