ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సర్వర్ డౌన్..!

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సర్వర్ డౌన్..!

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సర్వర్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది యూజర్లు తమ అకౌంట్ ఓపెన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. లాగిన్కు ప్రయత్నిస్తే సమ్ థింగ్ వెంట్ రాంగ్, బట్ డోన్ట్ వరీ ట్రై అగైన్ అనే మెసేజ్ కనిపిస్తోందని కొందరు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్య వెబ్ వినియోగదారులకు మాత్రమే తలెత్తగా.. మొబైల్లో మాత్రం యాప్ బాగానే పనిచేసింది. కాసేపటికి సమస్య పరిష్కారం కావడంతో వెబ్లోనూ ట్విట్టర్ అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిపై ట్విట్టర్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. 

ఇదిలా ఉంటే ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన ఎలాన్ మస్క్ సంస్థలో సమూల మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే సీఈఓ, సీఎఫ్ఓను తొలగించిన ఆయన.. టెస్లా నుంచి 50 మంది ఉద్యోగుల్ని ట్విట్టర్ లోకి తీసుకొచ్చారు. కాస్ట్ కటింగ్లో భాగంగా మౌలిక సదుపాయాల ఖర్చును భారీగా తగ్గించాలని నిర్ణయించిన మస్క్.. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.