వచ్చే వారం చివరిలో ట్విట్టర్ బ్లూటిక్ రూల్స్‌‌ బ్యాక్!

వచ్చే వారం చివరిలో ట్విట్టర్ బ్లూటిక్ రూల్స్‌‌ బ్యాక్!

బ్లూటిక్ మార్క్‌‌తో పెరిగిపోయిన ఫేక్ అకౌంట్‌‌లు

అఫీషియల్ అకౌంట్లకు గ్రే మార్క్ ఇచ్చే అవకాశం

ఫేక్ అకౌంట్‌ చేసిన ట్వీట్‌తో రూ.1.23 లక్షల కోట్లు నష్టపోయిన ఓ ఫార్మా కంపెనీ

న్యూఢిల్లీ : వెరిఫైడ్ బ్యాడ్జ్‌‌‌‌తోనే ఫేక్ అకౌంట్లు క్రియేట్ అవుతుండడంతో ‘8 డాలర్ల’ సబ్‌స్క్రిప్షన్ రూల్స్‌‌ను వెనక్కి తీసుకున్న  ట్విట్టర్‌‌‌‌, సవరించిన రూల్స్‌‌ను  వచ్చే వారం చివరిలో తీసుకొస్తామని ప్రకటించింది. కంపెనీ బాస్ ఎలన్ మస్క్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. కాగా, 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విట్టర్‌‌‌‌ను  మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఈ సోషల్ మీడియా కంపెనీ‌‌లో భారీగా మార్పులొచ్చాయి. కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లను  ట్విట్టర్‌‌‌‌ను కొన్న మొదటి రోజే మస్క్ తీసేయాగా, అక్కడి నుంచి మరో వారం రోజుల్లోనే సగం మంది ఉద్యోగులను తొలగించారు.

ఇప్పటి వరకు పొలిటీషియన్స్‌‌కు, ఫేమస్ వ్యక్తులకు, ప్రభుత్వ సంస్థలకు ఫ్రీగా బ్లూటిక్ మార్క్‌‌ను ఇచ్చిన ట్విట్టర్‌‌‌‌, మస్క్ నాయకత్వంలో ఈ వెరిఫైడ్ బ్యాడ్జ్ కోసం 8 డాలర్లు వసూలు చేయాలని చూసింది. ఈ కొత్త రూల్ వచ్చాక బ్లూటిక్ మార్క్‌‌తో చాలా  ఫేక్ అకౌంట్‌‌లు క్రియేట్ అయ్యాయి. ఏసుక్రీస్తు , సైతాన్ పేర్లతో కూడా బ్లూటిక్  ఉన్న అకౌంట్‌‌లు ఓపెన్ అయ్యాయి. దీనిపై మీమ్స్‌‌  హల్‌‌చల్ అవుతున్నాయి. ఫేక్ అకౌంట్స్ తగ్గించడమే లక్ష్యమని గతంలో మస్క్ పేర్కొనగా, ఆయన పాలసీల వలన ట్విట్టర్‌‌‌‌లో అఫీషియల్‌‌గా ఫేక్ అకౌంట్‌‌లు క్రియేట్ అవుతున్నాయి.  కొత్త రూల్స్‌‌పై విమర్శలు రావడంతో కంపెనీ బ్లూటిక్‌‌  మార్క్‌‌ను 8 డాలర్లకు ఎవరికైనా ఇవ్వడాన్ని వెనక్కి తీసుకుంది. కాగా  అఫీషియల్ అకౌంట్‌‌ను రిప్రెజెంట్ చేసేందుకు గ్రే టిక్ మార్క్‌‌ను తీసుకొస్తామని శుక్రవారం కంపెనీ సపోర్ట్ టీమ్ అకౌంట్ ట్వీట్ చేసింది.